మాజీ సర్పంచ్ల మీటింగ్ లో పాల్గొన్న బొమ్మకల్ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు...
కరీంనగర్: కరీంనగర్ ప్రెస్ భవన్ లో కరీంనగర్ చుట్టుప్రక్క గ్రామాల సర్పంచులు అందరూ కలిసి వారికి కావాల్సిన ప్రభుత్వ డిమాండ్ల పై సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మీడియా ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. వారి డిమాండ్లలో ముఖ్యంగా సర్పంచిగా చేసి పదవి ముగిసిన తర్వాత వారికి డబుల్ బెడ్రూం ఇల్లు, నెల నెల సర్వీస్ పెన్షన్ 10,000 రూ|| మరియు ప్రాథమిక హక్కులను తదితర డిమాండ్లను ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇందులో మా సర్పంచ్ ల ఫోరాం అధ్యక్లులు, మాజీ సర్పంచ్లు మరియు బొమ్మకల్ సర్పంచ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి హాజరైయ్యారు.


Comments
Post a Comment