అభివృద్దే నా లక్ష్యం..

 


    పేరు పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న బొమ్మకల్ గ్రామానికి గత 15 సంవత్సరాలుగా సర్పంచిగా చేస్తూ ప్రజల నుండి మంచి పేరును పొందుతున్నారు...

ఈయన 1973 లో బొమ్మకల్ గ్రామంలో  ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. ఇక్కడే ఉన్నత చదువులు పూర్తి చేసారు. యుక్త వయస్సుకు వచ్చే సరికి అతని గ్రామం పైన దృష్టి సారించారు. యూత్ లీడర్ గా చేసారు. కానీ గ్రామాన్ని అభివృద్ది చేయడానికి అతని అర్ఙత సరిపోలేదు అయినప్పటికి తన పుట్టిన గ్రామానికి ఏమైనా చేయాలని ఎంతో ప్రయత్నించారు. 

అతని కృషిని పట్టుదలను చూసి గ్రామ ప్రజలు అతనిని మంచి మెజారీటీతో సర్పంచిగా గెలిపించారు. అందుకు గాను ప్రజలకు సేవ చేయాలన్న కల ఇక నెరవేరిందని ఎన్నో గ్రామ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు గౌరవనీయు పురుమల్ల శ్రీనివాస్ గారు. వారు సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత చేసిన కొన్ని అభివృద్ధి పనులు.

1. ఒక్కప్పుడు నడవడానికి ఇబ్బంది ఉన్న వాడ వాడకు ఇప్పుడు సీసీ రోడ్డులు వేయించారు

2. స్మశాన వాటిక లేకుండా వాగు ఒడ్డున శవాలను దహనం చేసేది, కాని 10 సంవత్సరాల క్రిందటే ప్రభుత్వం చే మాట్లాడు గ్రామానికి స్మశాన వాటికని మంజూరు చేయించారు.

3. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులను నిర్మించడానికి తోడ్పడ్డారు.

4. మల్లయ్య చెరువు కట్ట గానీ, ఒకప్పుడు వరద నీళ్లు బొమ్మకల్ గ్రామ ప్రజల ఇల్లల్లో కి వస్తుండే

ఇలా ఇంక మరెన్నో వీరు చేపట్టిన అభివృద్ది పనులున్న తరుణంలో..

భూములు కబ్జాలు చేస్తు ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారని ఆరోపణలు పుట్టింటారు, కొందరు. దానికి గాను వీరు ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా జైలు శిక్ష ను కూడా అనుభవించారు. ఎటువంటి ఆధారాలు లేని కారణంగా తప్పుడు ఆరోపణలు చేసారని కోర్టు నిర్థారించి 73రోజుల శిక్ష తర్వాత భయటకు వచ్చారు. అయిన కూడా గ్రామ ప్రజలు అతని పైన ఉన్న నమ్మకం వారు చేసిన సేవలను మదిలో పెట్టుకుని. ఎవరు ఎన్ని చెప్పిన మేము నమ్మబోమని మల్లి భారీ మెజారీటితో గౌరవనీయులైన శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారిని సర్పంచి గా ఎన్నుకున్నారు గ్రామ ప్రజలు.

ఇందుకు గాను ఏదో ఒకటి తప్పకుండా గ్రామానికి చేయాలని నిర్ణయించుకున్న పురుమల్ల శ్రీనివాస్ గారు


తన సతీమని అయిన శ్రీమతి పురుమల్ల లలిత శ్రీనివాస్ (కరీంనగర్ రూరల్ జడ్పిటీస్) గారితో మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని గ్రామ అభివృద్ధి పనులను ఇంక ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పంతో, సర్పంచిగా ఎన్నికైన తర్వాత ... చెరువు కట్ట సుందరీకరణ, రాజీవ్ రహాదారి నుండి రోడ్డు సుంధరీకరణ, నూతన గ్రామ పంచాయతీ, మిగిలిన వార్డులలో సీసీ రోడ్డులు, వీధి దీపాలు, బైపాస్ లో లైట్లు వేయాలని నిర్ణయించుకున్నారు.


ఇందులో భాగంగానే హైవే రోడ్డు స్టేజి నుండి బొమ్మకల్ గ్రామంలో దాక అధ్బుతంగా రోడ్డును 2వే గా మార్చి మధ్యలో లైట్లను వేయించి డివైడర్ల మధ్యలో మంచి పూల మొక్కలు, చెట్లు నాటారు అలా రోడ్డును వెడల్పు గా వేసే ఒక్కపని మిగిలి ఉన్నది అది కూడా అది త్వరలో రాబోతుంది అని తెలిపారు.



మేము అనుకున్న కార్యచరణలలో భాగంగానే గ్రామ పంచాయతీ పనులను కూడా మొదలు పెట్టి స్లాబ్ వరకు పుర్తి అయ్యింది. అలాగే ఇంకే ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి చేసి తీరుతాను అని సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ గారు తెలిపారు.

ఒక సర్పంచిగా నేను ఈ గ్రామానికి ఎటువంటి అభివృద్ధిని తీసుకురాగలనో తీసుకొచ్చాను, తీసుకొస్తున్నాను. ప్రజల నన్ను ఓటు వేసి గెలిపించినందుకు నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను. ఇంతే కాదు వారు నన్ను ఇంకా ఏ స్థానంలో ఉంచిన కూడా వారు అనుకున్నదానికన్న 2 రెట్లు ఎక్కవ అభివృద్ధిని చూపించే సామర్థ్యం నాకు ఉంది అని తెలిపారు, గౌరవనీయులు సర్పంచ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు.





Comments